సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతం..! 4 d ago
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ముగిసిన టెస్టులో కివీస్ నిర్దేశించిన 658 పరుగుల ఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 18/2తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు సాంట్నర్ (4/85), సౌథీ (2/34), హెన్రీ (2/62) ధాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బెతెల్ (76), రూట్ (54) అర్ధసెంచరీలతో రాణించారు.